నేడు డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ విచారణ..

నవతెలంగాణ-హైదరాబాద్ : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కేసు ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు చేర్చడం చర్చనీయాంశం అయింది. కాగా, నేడు క్రిష్‌ను డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. దీంతో పాటు క్రిష్ బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించనున్నారు. అయితే గతంలో వివేక్ నిర్వహించిన పార్టీల్లో క్రిష్ ఉన్నారా..? అని పూర్థి స్థాయిలో దర్యాప్తును గచ్చిబౌలి పోలీసుల ముమ్మరం చేశారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ముగ్గురు నిందితుల ఫోన్లను పోలీసులు పంపారు. విచారణలో పెడ్లర్ అబ్బాస్ స్టేట్‌మెంట్ కీలకంగా మారనుంది. ఇప్పటికే వివేకానందకు అబ్బాస్ అలీ.. డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Spread the love