కాశ్మీర్ : సెలవులకోసం ఇంటికి వచ్చిన ఓ జవాను తన వాహనం నుంచి కిడ్నాపయ్యాడు.కాశ్మీర్‌లోనికుల్గాం జిల్లాలో జరిగిందీ ఘటన.కుల్గాంజిల్లాలోని అచతల్ ప్రాంతానికిచెందిన 25ఏండ్ల సైనికుడు జావేద్ అహ్మద్ వాని గత రాత్రి అదృశ్యమయ్యాడు.ఆయనకారు ఆ తర్వాత పర్నహాల్ సమీపంలో లభ్యమైంది.సమాచారంఅందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు సెర్చ్‌ఆపరేషన్ ప్రారంభించారు.సరుకులుతెచ్చేందుకు తన కారులోచౌవల్‌గామ్ వెళ్లిన జావేద్‌ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.ఆయనకోసం చుట్టుపక్కల గ్రామాల్లోగాలించారు.ఈసందర్భంగా పర్నహాల్ గ్రామంలోఆయన కారును గుర్తించారు.వాహనంలాక్ చేసి ఉండగా లోపల ఆయనచెప్పులు,రక్తపుమరకలు కనిపించాయి.జావేద్ కిడ్నాప్‌పై సమాచారం అందుకున్నఆర్మీ చుట్టుపక్కల గ్రామాల్లోపెద్ద ఎత్తున గాలింపు చర్యలుచేపట్టారు.