నవతెలంగాణ – హైదరాబాద్ : నగరంలోని పుప్పాల్ గూడ లో వివాహిత అదృశ్యం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణ ప్రియ అనే వివాహిత భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఉదయం ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన ఆమె భర్త బాలకృష్ణ మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ లేపక పోవడంతో కంగారు పడ్డ భర్త.. భార్య ఆచూకీ కోసం చుట్టూ పక్కల గాలించాడు. ఎక్కడా భార్య జాడ దొరకకపోవడంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గత రెండు సంవత్సరాల క్రితం బాలకృష్ణకు, కృష్ణ ప్రియకు వివాహం జరిగింది. పూర్తి వివరాలుత తెలియాల్సి ఉంది.