పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం

నవతెలంగాణ-హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని ఓఎన్డీ కల్యాణ్ ఆఫీస్ లో ఫైల్స్ మాయమైనట్లు తెలుస్తోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ దుండగులు ఎత్తుకెళ్లారు. ఓఎన్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎల్జి, వెంకటేశ్, ప్రశాంత్ లపై అనుమానం. ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్కు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫైల్స్ అదృశ్యంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేస్తున్నట్టు డీసీపీ తెలిపారు.

Spread the love