
కుటుంబ కలహాలతో ఇంటి నుండి మహిళ అదృశమై వెళ్లిపోయిన ఘటన మిరుదొడ్డి మండలంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన నల్ల దివ్య ఉదయం 11 గంటలకు ఇంటివద్దె ఉందని, మధ్యాహ్నం ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగిందని దివ్య భర్త రాజు తెలపడం జరిగిందని ఎస్ఐ నరేష్ వెల్లడించారు. సాయంత్రం వరకు చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకోవడంతో పాటు బంధువుల వద్ద దివ్య కోసం సమాచారం తెలుసుకున్న ఫలితం లేకపోవడంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎవరికైనా మహిళ కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఎస్ఐ నరేష్ తెలిపారు.