బీఆర్‌ఎస్‌ నేతల్లో నిరుత్సాహం

– అధికార పార్టీ వైపు చూస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు
నవతెలంగాణ-గజ్వేల్‌
అధికారం కోల్పోయి నెల రోజులు కాకముందే గజ్వేల్‌ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులు నిరుత్సానికి గురవుతున్నారు. స్థానికంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి గెలిచినా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్‌ చైర్మన్లు నెల రోజులు గడవకముందే జీర్ణించుకోలే కపోతున్నారు. పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవి ంచిన నాయకులకు అధికారం కోల్పోయి నిద్ర పట్టడం లేదు. అధికారాన్ని కోల్పోయామని కలలో సైతం కలవరపడు తున్నామని ఆ పార్టీ నేతలు చర్చించుకోవడం కల్పిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్లో గెలిచినప్పటికీ కార్యకర్తలు నాయకుల్లో తప్తి లేదు. అధికారంలోకి కాంగ్రెస్‌ కావడం వల్ల తమ పైరవీలకు అవకాశం ఉండదని భావిస్తున్న నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు వినికిడి. అధికారం లేకపోతే బతకలేమనే నాయకులు తొందరపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన నాయకులు కలుస్తున్నారు. పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచి స్తున్నప్పటికీ నాయకుల్లో మాత్రం పార్టీ మారదామని కాంగ్రెస్‌ కండువా వేసుకుందామని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డికి నియోజక వర్గంలో జరిగే కార్యక్ర మాలకు పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డి ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు నర్సారెడ్డిని వాకప్‌ చేస్తున్నారు. తాము పార్టీలోకి వస్తామని వచ్చే అన్ని ఎన్నికల్లో తమకంటూ ఒక స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పదవుల కోసమే కాకుండా పార్టీ కోసం సేవ చేసేందుకు వస్తే సరిపోతుందని సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో కనీసం పాత బిల్లులు, పాత కాంట్రాక్ట్‌ పనులు పూర్తి చేసుకున్నందుకు అధికార పార్టీలో అడుగు పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రజా ప్రతినిధులు పదవులకు కొందరు నేతలు టెండర్‌ వేసినట్టు తెలుస్తుంది. సుమారు ఐదు కోట్లు ఇస్తే పదవి వదిలి వేస్తారా? అని ప్రశ్నలు వేసుకుంటున్నారు. పదవి ఇవ్వలేం కానీ పార్టీలోకి వస్తామని ప్రాధేయ పడుత ున్నారు. ఈ ఐదు సంవత్సరాలు కాలం ఎలా గడుస్తుంది. తాము కాంట్రాక్టు పదవుల్లో పెట్టిన డబ్బులను ఎలా తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయ కులు ప్రయ త్నాలు చేస్తున్నారని తెలిసింది. పదవుల్లో ఉన్న నాయకులు కూడా పార్టీ మారా లని ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీలో కార్పొరేషన్‌, నామినేటెడ్‌ పదవు లను దక్కించు కోవచ్చని బీఆర్‌ఎస్‌ నాయకులు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపా యల అభివద్ధి పనులు జరిగిన చాలామంది నాయకులకు బిల్లులు రాలేకపో యాయి. గజ్వేల్‌, తూప్రాన్‌ మున్సిపా లిటీలో చేపట్టిన అభివద్ధి పనులకు పూర్తిస్థాయిలో నిధులు రాలేదు. అభివద్ధి పనులు చేయడానికి నిధులు మంజూరై సిద్ధంగా ఉన్నాయి. ఈ నిధుల విషయంలో అధికార పార్టీ నాయకులు సంబంధిత శాఖ అధికారులకు నిలిపివేయాలని ఇప్పటికే సూచించిన విషయం తెలిసింది. ఇది రాష్ట్రస్థాయిలో సీఎం రేవంత్‌రెడ్డి కింది స్థాయి అధికారుల వరకు ఆదేశాలు ఇవ్వాలని సంబంధిత జిల్లా పాలనా ధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపీపీలు, జెడ్పీ టీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు పరిధిలో ఉండే పనుల విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలిచినప్పటికీ పూర్తి అధికారాన్ని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో స్థానిక నేతలు కొంత అసంతప్తికి గురవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేసిన వారికే ముందు వరుసలో పదవులు ఉంటాయని ఇతర పార్టీల నుండి ఇప్పుడే పార్టీలోకి తీసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికార పార్టీ నేతలకు ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. మూడు సంవత్స రాల తర్వాత ఇతర పార్టీల నాయకులకు చేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పది సంవత్సరాలు అధికారం అనుభవి ంచిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అయోమ యానికి గురవుతున్నారు. గజ్వేల్‌ నియో జకవర్గంలో బీఆర్‌ ఎస్‌ పార్టీ నుంచి బయటకు రావాలని చాలామంది ప్రయ త్నం చేస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో నియోజక వర్గంలోని 9 మండలాల్లో మండల పరిష త్‌, జిల్లా పరిషత్‌, సర్పంచులు, మున్సిపల్‌ చైర్మన్‌, సింగిల్‌ విండో ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్‌కి బలమైన క్యాడ ర్‌ పెద్దగా లేకపోవడం వల్ల బీఆర్‌ఎస్‌ నాయకులు దాని ఆసరా చేసుకుని కాంగ్రెస్లో చేరుదామని ఎక్కడెక్కడ నుంచో అనుబంధాలను ముడిపెడుతున్నట్లు తెలుస్తుంది.

Spread the love