చెక్కులు పంపీిణీ

నవతెలంగాణ-గూడూరు
మండల కేంద్రం తహసిల్దార్‌ కార్యాల యంలో కళ్యాణ లక్ష్మి, షాద్‌ ముబారక్‌ చెక్కులను 37 మంది లబ్ధిదారులకు ఎమ్మె ల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. ఆడపిల్లల తల్లితండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని అ న్నారు. పనిచేసే ప్ర భుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో త హసిల్దార్‌ ఎమ్‌ఐ అశోక్‌ కుమార్‌, మండల పార్టీ అధ్యక్షులు వేం వెంకటకృష్ణారెడ్డి, మండల సర్పంచ్ల ఫోరంఅధ్యక్షులు ముక్క లక్ష్మణ్‌రావు, గుండెంగా ఎంపీటీసీ బోడ కిషన్‌, మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్‌, ముఖ్యనాయకులు రహీం, సంపత్‌రావు, కటార్‌ సింగ్‌, వెంకన్న, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Spread the love