నూతన రుణాల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో లక్ష రూపాయల రుణమాఫీ జరిగిన రైతులం దరికీ ప్రణాళికా బద్ధంగా నూతన రుణాల పంపిణీ పూర్తి చే యాలని జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు. మంగళ వారం ప్రగతి భవన్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్‌ఆర్‌సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మాట్లాడుతూ… జిల్లాలో ఇప్పటివరకు 37వేల910 మంది రైతులకు రూ.211కోట్ల92 లక్షల రుణమాఫీ సొమ్ము వారి రుణ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. జిల్లాలోని 3వేల795మంది రైతుల రుణ ఖాతాలు క్లోజ్‌ అయినందున రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ జమ చేయలేకపోయామని అన్నారు. ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా 3వేల617 మంది రైతుల రైతు బంధు ఖాతా వివరాలు సేకరించి, అందులో రుణమాఫీ సొమ్ము జమ చేస్తామని తెలిపారు. జిల్లాలో దాదాపు 178 మంది రైతుల బ్యాంకు ఖాతా వివరాలు లభించడం లేదని, వ్యవ సాయ విస్తరణ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి సదరు రైతుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి త్వరిత గతిన లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ద్వారా బ్యాంకర్లకు అందిం చాలని ఆదేశించారు. సెప్టెంబర్‌ చివరి నాటికి రుణమాఫీ జరిగిన రైతులందరికీ నూతన రుణాలు పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్‌ 11 నాటికి 1242 స్వశక్తి సంఘాలకు రూ.87 కోట్లు, మెప్మా కింద 125 స్వశక్తి సంఘాలకు దాదాపు రూ.7 కోట్ల99లక్షల రుణాలు అందించామని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న లక్ష్యాల్లో 41 శాతం పూర్తయిందని, పెండింగ్‌ రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లకు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకర్లకు అందాల్సిన గ్రూపు వివ రాలు వెంటనే అందజేసేలా జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలలో సైతం మెప్మా బందాల వివరాలు బ్యాంకులకు అందించి రుణాలు మంజూరి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 604 స్వశక్తి సంఘాలు రూ. 3.53 కోట్ల ఎన్‌పీఏ ఉందని అధికారులు వివరించారు. జిల్లాలో రుణాల రికవరీ పై శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ ఆదే శించారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికా రులు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. ఎస్సీ కార్పొరేషన్‌ , కార్పొరేషన్‌కు సంబంధించి యూనిట్లు గ్రౌండ్‌ చేయకుంటే ప్రభుత్వం విడుదల చేసిన సంబంధిత సబ్సిడీ సొమ్ము తిరిగి ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవా లని సూచించారు. అనంతరం 2023-24 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ తిరుపతి, వివిధ బ్యాంకు మేనేజర్లు, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు పట్టాల పంపిణీ చేపట్టాలి
పెండింగ్‌ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్ర మాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అన్నారు. మంగళవారం రేగొండ మండల తహసీల్ధార్‌ కార్యాలయంలో రేగొండ తహసీల్ధార్‌, కొత్తగా నెలకొన్న గోరికోతపల్లి తహసీల్ధార్‌లతో సమీక్షించారు. రేగొండ మండ లంలోని రామన్నగూడెంలోని సర్వే నెంబర్‌ 662, 663, కొత్తపల్లిగోరి గ్రామంలోని 391 సర్వే నంబర్‌లను పరిశీ లించి సాగులో ఉన్న రైతులకు పట్టాలు అందజే యాలని అన్నారు. ఎంజారు మెంట్‌ సర్వే పూర్తి చేసుకున్న రామన్న గూడెం 662,663 కొత్తపల్లి గోరి గ్రామంలోని 391 సర్వే నబర్లకు సాగులో అర్హులైన వారికి తక్షణమే పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో పెట్టుకున్న అర్జీలను పెండింగ్‌ లేకుండా చూడాలని అ న్నారు. తహసీల్ధార్లు సత్యనారాయణ స్వామి, రవికుమార్‌ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love