విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో చదువును అభ్యసించాలని శనివారం అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో కామన్ డైట్ ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల వసతి గృహంలో ఎమ్మార్వో సువర్ణ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. విద్యార్థులను చిన్నచిన్న పండగలకు ఇంటికి తీసుకెళ్లవద్దని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకు సహకరించాలని సూచించారు. తల్లిదండ్రులతో పాటు విద్యార్థులతో కలిసి సహ భక్తి భోజనం చేశారు. గురుకులంలోని సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివరాం, వైఎస్ ప్రిన్సిపాల్ ఎన్ మోహన్ రెడ్డి, షెడ్యూల్ కులాల వసతి గృహ వార్డెన్ నాగరాజు, ఎంపీడీవో తిరుపతిరెడ్డి, ఆర్ఐ రమాకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.