– కమ్మ కమ్మటి భోజనాలు రైతన్నల్లో ఆనందం
– ప్రభుత్వ ఆదేశాలు సింగిల్ విండోల ఏర్పాట్లు
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు భాగంగా రైతు దినోత్సవంలో వంటకాలు అదుర్స్ కమ్మకమ్మటి భోజనాలతో రైతుల్లో ఆనందం వ్యక్తం అయింది. ప్రభుత్వ ఆదేశాలు సింగిల్ విండోల ద్వారా వంటకాల ఏర్పాట్లు మద్నూర్ సింగిల్ విండో పరిధిలో ఐదు వ్యవసాయ క్లస్టర్లు ఉండగా డోంగ్లి సింగిల్ విండో పరిధిలో నాలుగు క్లస్టర్లు ఉన్నాయి. మద్నూర్ సింగిల్ విండో పరిధిలోని మజ్ను రైతు వేదిక వద్ద వంటిన వంటకాలు అదుర్స భోజనాలు చేసిన రైతుల్లో ఆనందం వ్యక్తం అయింది ఇక్కడ ఏది తినేవారికి అది వంటకాలు చేసినట్లు మాంసాహారం తినేవారికి చికెన్ సహకారం తినేవారికి సహకార వంటకాలు కూల్ వాటర్ ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. పెండ్లిల వంటకాల కంటే రైతు దినోత్సవం వేడుకల్లో వంటకాలు అదుర్స్ అంటూ రైతులు ఆనందం వ్యక్తం అయింది.