కవిత బెయిల్ పిటీషన్ కొట్టివేత..

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో నిరాశే మిగిలింది. కోర్టు ఆమెకు బెయిల్‌ను నిరాకరించింది. ఈడీ, సీబీఐ.. రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు కోర్టులో నిరాశే ఎదురైంది.

Spread the love