జన్నారం మండలంలోని పోన్కల్, జన్నారం తిమ్మాపూర్ తో సహా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డ్ పై ఆ గ్రామ ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ గ్రామంలోని అన్ని వార్డుల్లో ఉన్న ఓటర్ల జాబితాను శుక్రవారం ఆ పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డుపై అంటించామని ఈవో రాహుల్ ఆయా గ్రామాల కార్యదర్శిలు తెలిపారు. ఓటర్లు ఆ జాబితాలో ఉన్న పేర్లను వివరాలను సరిచూసుకోవాలని వారు సూచించారు.