జియో సేవలకు అంతరాయం.

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జియో టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్‌ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్‌ సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం.. జియో ఫైబర్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ విషయంలో యూజర్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. దీనికి గల కారణమేంటన్నది తెలియరాలేదు. దీనిపై జియో అధికారికంగా స్పందించాల్సి ఉంది. కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసినా సరిగా స్పందించడం లేదంటూ పలువురు యూజర్లు వాపోతున్నారు.

Spread the love