ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తా

convert english to telugu– ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటన
పారిస్‌ : ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ప్రకటించారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో మారిన్‌ లీ పెన్స్‌కి చెందిన మితవాద నేషనల్‌ ర్యాలీ (ఆర్‌ఎన్‌) పార్టీ చేతిలో మాక్రాన్‌ కూటమి తీవ్రంగా ఓటమి పాలవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వచ్చిన యురోపియన్‌ పార్లమెంట్‌ ఫలితాలు తమ ప్రభుత్వానికి చాలా నిరాశజనకంగా వున్నాయని, వాటిని ఎంత మాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, జూన్‌ 30న దిగువ సభ ఎన్నికలు జరుగుతాయని, జులై 7న రెండో రౌండ్‌ ఓటింగ్‌ జరుగుతుందని తెలిపారు. వివరణ ఇవ్వడానికి ఇది చాలా కీలకమైన సమయమని ఆయన వ్యాఖ్యానించారు. మీ ఆందోళనలన్నింటినీ విన్నాను, వాటిని సమాధానం చెప్పకుండా వదిలిపెట్టబోనని చెప్పారు. సామరస్యతతో వ్యవహరించడాలంటే ఫ్రాన్స్‌కు స్పష్టమైన మెజారిటీ అవసరమని అన్నారు. మితవాదపార్టీలు మొత్తంగా అన్ని చోట్లా ముందంజలో వుంటున్నాయి, అందువల్లే ఈ పరిస్థితి కారణంగానే తాను రాజీనామా చేయడం లేదన్నారు. మొదటి ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం లీ పెన్స్‌ నేషనల్‌ ర్యాలీ పార్టీ 32శాతం ఓట్లను గెలుచుకుంది. సోషలిస్టులు 14శాతంతో వున్నారు. లీపెన్స్‌ బలంగా ఎదుగుతుండడం వల్ల అధికారంపై మాక్రాన్‌ పట్టు బలహీనమవుతుందని భావిస్తున్నారు.

Spread the love