అంగన్వాడీలకు కార్గో ద్వారా బాల అమృతం పంపిణీ

– సిడిపిఓ మల్లీశ్వరి
నవతెలంగాణ -తాడ్వాయి : మండలంలోని ఐ సి డి ఎస్ తాడ్వాయి ప్రాజెక్టులోని తాడ్వాయి సెక్టార్ పరిధిలో అంగన్వాడి కేంద్రాలకు ఆర్టీసీ కార్గో ద్వారా మంగళవారం బాలమృతం, నూనె, తదితర పౌష్టికాహార పదార్థాలు సిడిపిఓ మల్లీశ్వరి ద్వారా సరఫరా చేశారు. అంగన్వాడి టీచర్లు సమ్మెలో ఉన్నందున సిడిపిఓ మల్లీశ్వరి సూపర్వైజర్ల సహాయంతో పరిధిలోని అన్ని అంగన్వాడి కేంద్రాలకు సరుకులు సరఫరా చేశారు. పిల్లలకు పోషకాహారం అదేవిధంగా సెక్టర్ పరిధిలో అన్ని చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love