బతుకమ్మ చీరల పంపిణీ..

నవతెలంగాణ – గోదావరిఖని

దసరా పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ గోదావరి ఖనిలోని 48వ డివిజన్ లో కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ పొన్నం విద్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడపడుచుల అందరికీ బతుకమ్మ చీరలను ఇవ్వడం ఆనవాయిది మారిందని అన్నారు. ఈ బతుకమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ ఆదేశాల మేరకు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ మరియు కోఆప్షన్ నెంబర్ తానీపర్తి విజయలక్ష్మి గోపాలరావు మరియు 48వ డివిజన్ మరియు 50 వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love