భువనగిరి మండలంలోని గౌస్ నగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఐడెంటి కార్డు, టై, బెల్టు, బ్యాచ్ లను అందజేశారు. విద్యార్థులకు సామాగ్రి (బెల్టు, ఐడి కార్డు, బడ్జ్) అందజేసిన దాత ఎలిమినేటి వెంకటరెడ్డికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సైదా కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎంసి చైర్మన్ గడసందుల సత్తయ్య, పాఠశాల ఉపాధ్యాయులు గడ్డమీద పాండు గౌడ్ , సిహెచ్ సుధాకర్ లు పాల్గొన్నారు.