మాగంటి సూర్యం జ్ఞాపకార్థం పేదలకు దుప్పట్లు పంపిణీ

నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
జూనియర్‌ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరంలో సోమవారం లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యాసంస్థల అధినేత శ్రీ సాయిబాబా ఆలయ మాజీ అధ్యక్షులు అయిన దివంగత మాగంటి సూర్యం జ్ఞాపకార్థంగా వారి కుమారులు మాగంటి ప్రసాద్‌, రమేష్‌ బాబులు, మనుమడు మాగంటి సూర్య కలిసి వృద్ధులు, యాచకులకు భోజనంతో పాటు దుప్పట్లు వితరణగా అందించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ బాబు, రమేష్‌ బాబులు మాట్లాడుతూ…లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాగంటి సూర్యం అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ప్రధానంగా ఏజెన్సీలో ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో భద్రాచలం ఏజెన్సీలో లిటిల్‌ ఫ్లవర్స్‌ విద్యాసంస్థలను నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగాలలో మాగంటి సూర్యం అనేక రకాల సేవలు అందించారని అన్నారు. మాగంటి సూర్యం ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులుగా తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం మాగంటి సూర్యం వర్ధంతి సందర్భంగా అన్నదానంతోపాటు వృద్ధులకు దుప్పట్లు అందించడం జరుగుతుందని, అది భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

Spread the love