నవతెలంగాణ – జక్రాన్ పల్లి
విజ్ఞానం, వినోదం అందించే పుస్తకాలను అందరూ చదవాలని ఉషా బాల పవన్ కుమార్ గారి గొర్తి ఈశ్వర ట్రస్టు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సంస్థ యొక్క నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పాట్కూరి తిరుపతిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రస్ట్ ఆధ్వర్యంలో సినారె సరస్వతం, బొడ్డులో సంచి భారతదేశంలో తత్వశాస్త్రం తదితర 40 రకాల పుస్తకాలను జక్రంపల్లి మండలం పడకల్ గ్రామీణ గ్రంథాలయానికి వితరణ చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంకం నరేష్, మరియు అల్లూరి గంగారెడ్డి సట్ల సాయన్న మరియు లోకపురుషోత్తం మహేందర్ రెడ్డి బాలా గౌడ్ సుమన్ ప్రవీణ్ రుస్తుంఖాన్ తంబాకుల గంగారెడ్డి గ్రంథపాలకులు రీడర్స్ తదితరులు పాల్గొనడం జరిగినది.