పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ 

నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్  గ్రామ పంచాయతీ సిబ్బందికి శనివారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ మేరకు  గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప సర్పంచ్  ఏనుగు రాజేశ్వర్ రెడ్డి   చేతుల మీదుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగను పురస్కరించుకొని  గ్రామ పంచాయతీ నిధుల నుండి సిబ్బందికి కానుకగా నూతన  వస్త్రాలు అందించినట్లు తెలిపారు. ఎనిమిది మంది  పంచాయతీ  సిబ్బందికి రెండు జతల చొప్పున దుస్తులను అందించినట్లు ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా నూతన దుస్తులను అందజేసిన సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్, పంచాయతీ పాలకవర్గం సభ్యులకు పంచాయతీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసయ్య, కారోబర్ రమణ కుందేటి శ్రీనివాస్, మండపల్లి మహేందర్, భరత్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love