
బోయ గూడెం గ్రామానికి చెందిన కర్ణాటి కవిత ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ విషయాన్ని యుటిఎఫ్ సభ్యుల ద్వారా ఎమ్మెల్సీకి తెలిపినారు. స్పందించిన ఎమ్మెల్సీ 45 వేల రూపాయల సీఎం రిలీఫ్ చెక్కును రావడానికి తన వంతు సహాయ సహకారాలు అందించి మంగళవారం జిల్లా పరిషత్ పాఠశాల హాలియా నందు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం చేతులమీదుగా కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కవిత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. చెక్కు అందించే కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గుండా కృష్ణమూర్తి, దాస వెంకన్న ,టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వడ్త్య రాజు, అనుముల మండల అధ్యక్షులు మన్నెం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు మచ్ఛ సునీత ,ప్రధాన కార్యదర్శి చింతపల్లి రవీందర్, అంజయ్య, ఇస్రం చంద్రయ్య ,సైదులు అక్కయ్య బాబు ,షాబుద్దీన్ మరియు జడ్పీహెచ్ఎస్ హాలియా ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.