నవతెలంగాణ – జక్రాన్ పల్లి
సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుండి నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 9 గురుకి సీఎం సహాయనిధి చెక్కులను అందజేసినట్లు నిజాంబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్ తెలిపారు. నోముల లావణ్యకు రూ.25000, బుస సాయికుమార్ కు రూ.17500, వన్నెల నాడీపీ లింగన్నకు రూ.34000, తీపిరి గంగుకు రూ.22000, తలరీ మహేష్ కు రూ.17000, ఏలేటి స్వామికి రూ.14500, గుర్రపు హరుణ్ కు రూ.14000, గన్న పోసన్నకు రూ.20000, బండి మురళికి రూ.13000, చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఇన్చార్జి సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీకాట్ పల్లి నర్సారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, గన్న లక్ష్మణ్, .సైకిల్ టెక్స్ అక్బర్, సాయిలు, నట్టా తిరుపతి, సుధీర్ , తదితరులు పాల్గొన్నారు.