నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కారు గుర్తు బడే నాగజ్యోతి ఫోటోతో ఉన్న పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. పసర లో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ శ్రీనివాస్ కు కారు గుర్తు నాగజ్యోతి ఫోటో ఉన్న పోల్ స్లిప్పులను చూపించి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై శ్రీనివాస్ వివరణ కోరగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. వాస్తవానికి ఓటరు పోల్ స్లిప్పులను ఇప్పటికే బూతు లెవెల్ అధికారి మరియు ఆశా కార్యకర్తలు పంపిణీ చేయడం జరిగింది. రాజకీయ పార్టీలు పోల్ స్లిప్పులను పంపిణీ చేయకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అతిక్రమించి పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఫిర్యాదుల పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సంఘటనలు తలెత్తిన సి విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని శ్రీనివాస్ అన్నారు. ఈ విధానంగా స్లిప్పులు పంచడం మంచి పద్ధతి కాదని రిపీట్ కాకుండా చూడాలని శ్రీనివాస్ ను పసర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరారు.