సొసైటీ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాలు పంపిణీ

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లిరెడ్డి గ్రామంలో సొసైటీ కార్యాలయ ఆవరణలో సొసైటీ చైర్మన్ రాజా గౌడ్ రైతులకు జిలుగు విత్తనాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు జిలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులు ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకువచ్చి జిలుగు విత్తనాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ విట్టల్, ఏఎంసీ వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ రాజలింగం, ఎంపీటీసీ సాయ గౌడ్, సొసైటీ డైరెక్టర్లు, సీఈఓ మోహన్ గౌడ్, రైతులు, తదితరులు ఉన్నారు.

Spread the love