రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

నవతెలంగాణ -గోవిందరావుపేట
మండల కేంద్రంలో వరదల వల్ల నీటి మునిగి మరియు ఇల్లు కూలి సర్వస్వం కోల్పోయిన బాధితులకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క నిత్యవసరకులను అందించారు. మంగళవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సీతక్క రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో వరద బాధితులకు నిత్యవసరాలు అందించారు ఈ సందర్భంగా శీతక్క మాట్లాడుతూ 300 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25కేజీల బియ్యం, వంటనూనె, ఉల్లిగడ్డ, చింతపండు, కారం, పసుపు, బ్లాంకెట్లు, బట్టలు, చాపలు, చీరలు, ఉప్పు ప్యాకెట్లు, సర్ఫ్ ప్యాకెట్లు, సబ్బులతో సహా అన్ని రకాల సరుకులు సీతక్క  అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల వలన ప్రాణాలు కోల్పోతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  కనీసం ఫాంహౌస్ యందు ఉంటు కనీసం పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. అలాగే భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు ముందుగా హెచ్చరించిన కూడా ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇంత నష్టానికి పరోక్షముగా కారకులయ్యారు అని అన్నారు. ములుగు నియోజకవర్గంలో నేను స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా వరద బాధితులకు కనీస అవసరాలను తీరుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అని, కానీ మీరు మాత్రం కనీసంగా వరదల గురించి మాట్లాడకుండా ఉండడం విడ్డూరంగా ఉందని, వరదల్లో చిక్కుకుని మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 5లక్షల రూపాయలు, ఇండ్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి, వంట సామాగ్రి కొరకు లక్ష రూపాయల సహాయం, నీట మునిగిన ఇండ్లకు లక్ష రూపాయల సహాయం అందించాలని, అలాగే వరదల వల్ల పొలాల్లో ఇసుక మేటలు పెట్టి పంటలు దెబ్బతిన్నాయని, ఎకరానికి 30,000/- రూపాయల తక్షణ సహాయం అందించాలని సీఎం కెసిఆర్ గారిని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవి చందర్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లేల్ల భరత్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, మండల మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, జంపాల చంద్రశేఖర్, గోపిదాసు రజిత, గోపిదాసు వజ్రమ్మ, కట్ల ప్రమీల, పులుసం లక్ష్మి, కోరం రామ్మోహన్, గుండె శరత్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love