ముత్తాపూర్ గ్రామ 130 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ముత్తాపూర్ గ్రామంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన 130 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు బుధవారం సారపాక గ్రామ ప్రజలు నిత్యవసరాలను పంపిణీ చేశారు.  ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ హాజరై పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ వరద బాధితుల కోసం ప్రతినిత్యం ప్రతిరోజు దాతలు ముందుకు రావడం మనమందరము హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎమ్మెల్యే సీతక్క అడిగింది తడవుగా రాష్ట్ర నాలుగు మూలల నుండి దాతలు ముందుకు వచ్చి నిత్యం ఏదో ఒక విధంగా వరద బాధితులను ఆదుకుంటున్నారని అన్నారు.భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు ముందుగా హెచ్చరించిన కూడా ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇంత నష్టానికి పరోక్షముగా కారకులయ్యారు అని అన్నారు. ములుగు నియోజకవర్గంలో నేను స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా వరద బాధితులకు కనీస అవసరాలను తీరుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అని, కానీ మీరు మాత్రం కనీసంగా వరదల గురించి మాట్లాడకుండా ఉండడం విడ్డూరంగా ఉందని, వరదల్లో చిక్కుకుని మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 5లక్షల రూపాయలు, ఇండ్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి, వంట సామాగ్రి కొరకు లక్ష రూపాయల సహాయం, నీట మునిగిన ఇండ్లకు లక్ష రూపాయల సహాయం అందించాలని, అలాగే వరదల వల్ల పొలాల్లో ఇసుక మేటలు పెట్టి పంటలు దెబ్బతిన్నాయని, ఎకరానికి 30,000/- రూపాయల తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లాడే శ్యామ్ రావు, జిల్లా ప్రచార కార్యదర్శి దేవంద్ర చారి, శ్రీనివాస్, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, గ్రామ అధ్యక్షులు కుంజ శ్రీను, ఉపసర్పంచ్ దగట్ల కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ నాయకులు, సారపాక గ్రామ సహకార సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love