భక్త మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్యవసరాల పంపిణీ

నవతెలంగాణ -గోవిందరావుపేట

మండలంలోని పసర గ్రామంలో భక్త మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో పలువురు వరద బాధితులకు నిత్యవసర వస్తువులను అందించినట్లు సంఘం అధ్యక్షులు ముండ్రాతి ప్రవీణ్ తెలిపారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో ఇటీవల వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన పాపాన సిద్దు, దుబాసి సాంబయ్య ల కుటుంబాలకు భక్త మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి వంద కిలోల బియ్యం 5 కేజీల నూనె 5 కేజీల కందిపప్పు చొప్పున ఇతర నిత్యవసరాలను కూడా అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వడ్డేపల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఇంజపురి సూర్యప్రకాష్, కోశాధికారి ఖ్యాతం సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు పెద్దరామయ్య, యాదగిరి, రాజయ్య, నాగయ్య, సునీల్, సతీష్, ఐలయ్య, అశోక్, సుబ్బారావు, శ్రీను, కృష్ణ, సరళ, రవళి తదితరులు పాల్గొన్నారు.
Spread the love