నవతెలంగాణ – సిద్దిపేట
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి ఎస్ . భగవంతయ్య మరియు స్థానిక కౌన్సిలర్ పూర్ణిమ ఎల్లం యాదవ్ లు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నదనీ, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలకు సక్రమంగా పంపించాలని కోరారు. త్వరలో విద్యార్థులకు రెండు జతల దుస్తులు అందించనున్నామని, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు జె. శ్రీనివాస్, ఉపాధ్యాయులు జి.తిరుపతిరెడ్డి ,రమాదేవి , సంధ్యారాణి ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, దామోదర్, అంజిరెడ్,డి మల్లయ్య, ప్రభాకర్, కౌసర్ సుల్తానా, సుమిత్ర, గంగా భగీరత, కరుణా దేవి, బాల్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.