26వ వార్డులో పండ్ల ,పూల మొక్కల పంపిణీ

నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని 26వ వార్డు రాజారాం నగర్ కాలనీ యందు గురువారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పండ్ల ,పూల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు ..ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ ఎస్సార్ సుజాత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని,, స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి కృషితో నియోజకవర్గ అభివృద్ధి శరవేగంతో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి సమత, కార్యదర్శి మందుల రుక్మాబాయి, సంఘ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love