పారిశుద్ధ కార్మికులకు పండ్లు వాటర్ బాటిల్ల పంపిణీ

నవ తెలంగాణ:భూపాలపల్లి -కాటారం
దీర్ఘకాలిక సమస్యలపై సమ్మె చేస్తున్న పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ కార్మికులకు పండ్లు, వాటర్ బాటిల్లను అందజేశారు. కాటారం మండల కేంద్రానికి చెందిన ప్రజా జ్యోతి స్టాఫ్ రిపోర్టర్ స్వర్గీయ వేముల శ్రీశైలం గౌడ్ జ్ఞాపకార్థం తన సోదరుడు, సీనియర్ పాత్రికేయులు వేముల బొర్రాజు పారిశుద్ధ్య కార్మికులకు తన ఔదార్యాన్ని ప్రకటించారు. పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె సమంజసమైనదని, వారి సమస్యలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని బొర్రాజు అన్నారు. కార్మికులకు అరటి పండ్లు, వాటర్ బాటిల్ అందించినందుకు కార్మిక సంఘం నాయకులు దోమల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love