వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మదర్శలో పండ్ల పంపిణీ 

నవతెలంగాణ – భగత్ నగర్:  మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో 54 వ డివిజన్ కశ్మీర్ గడ్డ లోని మదర్శలో పిల్లలకు అరటి పళ్లు బిస్కట్ పాకెట్స్ పంపిణీ చేశారు. అనంతర జిల్లా చైర్మన్ మొహమ్మద్ తాజోద్దీన్ మాట్లాడుతూ వైఎస్ఆర్  కృషి వల్లె ముస్లిం లకు 4% రిజర్వేషన్ వచ్చిందనీ ,ఇవేకాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 108, 104 అంబులెన్స్ లు, షాది ముబారక్, కల్యాణ లక్ష్మీ ఇలా చాల మంచి పనులు చేసిన మహ గోప్ప మంచి వ్యక్తి మన రాజశేఖర్ రెడ్డి  అని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నాయకులు నెహాల్ అహ్మద్ మొహమ్మద్ కలిముద్దీన్ MD ఫిరోజ్ మతీన్ ఖాన్ MD అజీం అరిఫ్ ఖాన్ MD మతీన్ ఇబ్రహీం చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Spread the love