నవతెలంగాణ- తొర్రూర్ రూరల్ : మడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు శనివారం శీతల పానీయం, పండ్ల పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా మరో అభిమాని తూర్పాటి రవి పట్టణ కేంద్రంలోని గోశాలకు ఐదువేల రూపాయల విలువచేసే రెండు క్వింటాల తౌడును అందజేశారు అలాగే మందుల యాకయ్య పెద్ద ముప్పారం గ్రామంలో గల అమ్మ ఒడి అనాధాశ్రమానికి బిర్యాని పండ్ల పంపిణీ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మడిపల్లి మాజీ ఉపసర్పంచ్ నల్గురీ రామలింగం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తూ ప్రజా సమస్యలను తీరుస్తూ ఆపదలో ఉన్నవారు అన్నా అంటే నేనున్నానంటూ చేయూతనందించే మంచి మనసున్న నాయకుడు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి అని అన్నారు. ఎంతోమంది సమస్యలు వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ తన వద్దకు వస్తే జటిలంకాని సమస్యలను కూడా పరిష్కరించి వారిని ఆదుకొని సహాయ సహకారాలు అందించిన నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రావుల అనిల్ రెడ్డి, కే పాపిరెడ్డి, కే నరసింహారెడ్డి, మోతే అశోక్ రెడ్డి, రాములు, గడిల పుల్లయ్య, వేల్పుల ఐలయ్య, వేల్పుల వెంకటస్వామి, మహంకాళి సంపత్, చెట్టు పెళ్లి శ్రీను, బాల్య అశోక్, బండ అమరేందర్, ఆర్కేఆర్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.