ఆదివారం విజయబెరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలకు సంబంధించిన కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్స్ లను పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో సిడబ్ల్యుసి మెంబర్, బీహార్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మదన్మోహన్ జా ఆవిష్కరించారు. పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో సోమవారం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తూ వివరించారు
ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు తహెర్ బిన్ హుందాన్ , పీసీసీ మాజీ అధికార ప్రతినిధి మార చంద్ర మోహన్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి,సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి,పిసిసి ప్రచార కమిటీ మెంబర్ కోల వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ,సత్యనారాయణ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ హబిబ్ ఫ్లోర్ లీడర్ మహిమూద్ అలి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కాళ్లగడ్డ శ్రీకాంత్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్ నాయకులు అఖిల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.