ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (హెచ్ బి ఎన్ సి) కిట్ల అందజేత..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వినయ్ కుమార్ ఆశలకు (hbnc) కిట్లను అందజేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద, గృహ ఆధారిత నవజాత సంరక్షణ కిట్లను అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని నవజాత శిశు మరణాలను తగ్గించడానికి వీటిని అందజేసినట్లు ఆయన తెలిపారు. దీనిలో శిశువు ఎత్తు బరువులను కొలిచే మిషన్, టార్చ్ లైట్, బేబీ టీమర్, శరీర ఉష్ణోగ్రతను చూడడానికి థర్మామీటర్, బేబీ బెడ్ మరియు బ్లాంకెట్, మొదలగు వస్తువుల ద్వారా చిన్న పిల్లలను చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ జీవో చింతాల శ్రావణ్ కుమార్, ఆరోగ్య సూపర్వైజర్ మాలంబి, ఆశలు స్రవంతి, లావణ్య ,తదితరులు ఉన్నారు..
Spread the love