ముమ్మరంగా పోడు పట్టాలు పంపిణీ…

నవతెలంగాణ – అశ్వారావుపేట 
గత మూడురోజులుగా నియోజక వర్గంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముమ్మరంగా పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మండల పరిధిలోని మల్లాయిగూడెం పంచాయితీ దిబ్బగూడెం, పండువారిగూడెం, దబ్బతోగు, అనంతారం పంచాయితీ, గాండ్లగూడెం పంచాయితీ ల్లో పోడు పట్టాలు పంపిణీ చేపట్టారు. గాండ్లగూడెం లో హలఆవత్ చిన్ని,ప్రసాద్ అనే సోదరులు భూ వివాదంలో చిన్ని కి పట్టా పొందలేక పోయాడు. ఈ విషయం అయి తనకు పట్టా రాలేదంటూ గాండ్లగూడెం సభలో చిన్ని దరఖాస్తు ఇచ్చాడు. ఈ క్రమంలో గ్రామస్తులు మద్య సంభవించిన స్వల్ప రసాభాస తో ఎమ్మెల్యే మెచ్చా ఆగ్రహం వ్యక్తం చేసారు.ఊరూర తిరిగి లబ్దిదారులకు తానే స్వయంగా పోడు పట్టు ఇవ్వడానికి వస్తే గలాటా సృష్టించడం సరికాదని, ఒక్కళ్ళు గొడవ చేస్తే మిగతా అందరూ నష్టపోతారని పరోక్షంగా హెచ్చరించారు.పట్టాలు తీసుకెళ్తానని గట్టిగా మాట్లాడారు. పోలీసులు కలుగజేసుకోవడంతో రసాభాస  సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి,అశ్వారావుపేట,దమ్మపేట జెడ్పీటీసీలు చిన్నంశెట్టి వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ లు నారం రాజశేఖర్, దాసరి నాగేంద్రరావు, భూక్యా చిలకమ్మ, మాజీ ఎం.పి.పి, జెడ్పీటీసీలు బరగడ క్రిష్ణ, జేకేవీ రమణారావు, బండి పుల్లారావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, యు.ఎస్ ప్రకాశ్ రావు, కాసాని చంద్రమోహన్, సంపూర్ణలు ఉన్నారు.
Spread the love