నవతెలంగాణ – మల్హర్ రావు
ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ ఆదేశాల మేరకు రేపు ఆదివారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ చిత్రపటాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని సొసైటీ కాళేశ్వరం జోనల్ యువత అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా సొసైటీ జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి హాజరవుతారని,కాటారం డివిజన్ లోని సొసైటీ నాయకులు, సభ్యులు సకాలంలో హాజరై కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కోరారు.అలాగే చిత్రపతాలను అంబేద్కర్ వాదులు,ప్రజాసంఘాల నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో హాజరై చిత్రపటాలను స్వీకరించాలన్నారు.