– జిల్లా ఎన్నికల అధికారి సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-తాండూరు
పోస్టల్ బ్యాలెట్ పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం తాం డూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సమీ క్షించారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, ఈ జిల్లాకు చెం దిన, ఇతర జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి, అత్యవ సర సేవలు అందించే శాఖల సిబ్బందికి, అలాగే 80 ఏండ్లు దాటిన వయోవృద్ధులకు 40 శాతం కన్నా ఎ క్కువ అంగవైకల్యం ఉన్న వికలాంగులకు హౌమ్ ఓటింగ్ కోసం ఫామ్ 12, ఫామ్ 12డి ద్వారా పోస్టల్ బ్యాలెట్ పంపిణీకి చేపట్టిన పనులను పరి శీలించారు. ఈనెల 21 నుండి 24 వరకు పోస్టల్ బ్యాలెట్‌ల పంపిణీ పూర్తి కావాలని సిబ్బందికి సూ చించారు. దాదాపు 7వేల పైచిలుకు పోస్టల్ బ్యాలె ట్‌లను అందింస్తామన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించామ న్నారు. ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని 30వ తేదీన నిర్వహించు పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. మొత్తం 1133 కేం ద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నామని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తామ న్నారు. ఓటర్లందరికి ఇప్పటి వరకు 50 శాతం ఓ టర్ స్లిప్పులు అందించామని మిగిలిన స్లిప్పులన్నీ 3 రోజుల్లో అందింస్తామని సూచించారు. దీనితో పా టు సి-విజిల్‌కు సంబంధించిన పాంప్లెట్లు, ఓటర్ గైడ్లైన్స్ అందిస్తామన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాం టి ప్రలోభాలకూ లొంగకూడదని సూచించారు. ఈ రోజు నుండి ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పొలిటికల్ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించడం జరుగు తుందన్నారు. నిబంధనల మేరకు ప్రచార కార్యక్ర మాలను 24 గంటల ముందు ముగుస్తుందని, అంద రి సహకారంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్ని కలు నిర్వహింస్తామని తెలిపారు. సి-విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరిస్తామని పోటీలో ఉన్న అభ్యర్థులు చేస్తున్న ఖర్చులపై నిఘా ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో వ్యయ పరిశీల కులు రత్నాకర్ కాలు, తాండూర్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి అనిల్ కుమార్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.