నవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన గుండెల బాలవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన 50 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు బ్యాగరి నవీన్, బోయిని పరశురాములు ,తదితరులు పాల్గొన్నారు.