వృద్ధులకు రగ్గుల పంపిణీ..

నవతెలంగాణ-ధర్మసాగర్
వృద్ధులకు, వితంతువులకు రగ్గుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. మండల కేంద్రంలో శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి 73వ జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో వృద్ధులకు వితంతువులకు రగుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కొట్టే ప్రవీణ్ ఆధ్వర్యంలో వారు నివాసంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచి ఎర్రబెల్లి శరత్ పాల్గొని రగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కడియం శ్రీహరి మంచి నాయకుడుగా, ప్రజల శ్రేయస్సు కోరే  ప్రియతమ నాయకుడుగా, అపార భగీరథుడిగా పేరున్న నాయకుడు కడియం శ్రీహరి అని పొగిడారు. ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని కోరుకున్నారు. ఆయనకు గుర్తుగా నిరుపేదలైన వృద్ధులకు వితంతువులకు ఈ మంచి కార్యక్రమం చేయడం గర్వకారణంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు అరుణ రవీందర్, నాయకులు బొడ్డు ప్రదీప్ కుమార్, బొడ్డు సురేష్, కొట్టే యాదగిరి, కొట్టే జలంధర్ గ్రామస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love