ప్రభుత్వ పాఠశాల కు  సౌండ్ బాక్స్ వితరణ..

Distribution of sound box to government school..నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి 2002 పదవతరగతి బ్యాచ్ కి చెందిన పూర్వవిద్యార్థులు 25 వేల రూపాయల విలువగల వైర్లేస్ డిజే సౌండ్ బాక్స్ బహుకరించారు. హెడ్ మాస్టర్ సదానందం స్కూల్లో సౌండ్ బాక్స్ కొరత ఉందని మా దృష్టికి తీసుకురాగానే ,   చెందిన పూర్వ విద్యార్థులం అందరం వెంటనే స్పంధించి  డిజే సౌండ్ బాక్స్ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగింది అని తెలిపారు. ఇలాగే మా బ్యాచ్ తరపున భవిష్యత్తులో కూడా మేము చదువుకున్న స్కూల్ కి ఎల్లప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.ఈ కార్యక్రమం లో పూర్వవిద్యార్థులు బొడ్డు ప్రశాంత్ కుమార్, బైరి నారాయణ, గసికంటి తిరుపతి, లింగంపెల్లి మోహన్, పొత్తూరి మల్లేష్ వాసాల గణేష్, బాస రాజు, సాగర్, మేడుదుల శ్రీను,సుంకపాక కిరణ్,పిట్టల నవీన్,ఆడెపు పర్షరాములు,బాస స్వరూప,గుగ్గిళ్ల స్వప్న, బొడ్డు మణెమ్మ,, విద్యా కమిటీ చైర్మన్ కైర వసంత,తదితర మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love