సౌండ్ సిస్టం బాక్సుల వితరణ 

నవతెలంగాణ – మోర్తాడ్ 

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు 30 వేల రూపాయల విలువగల సౌండ్ సిస్టం బాక్సులను పాఠశాలకు వితరణ చేశారు. హైదరాబాద్ కు చెందిన వేల్పుల విజయ్ వ్యాపారవేత్త 30 వేల రూపాయల విలువగల హౌసా సౌండ్ సిస్టం ఎంప్లిఫైర్ బాక్సులు పాఠశాల మైకల్ సౌండ్ సిస్టం సౌకర్యార్థం వితరం చేసినట్లు తెలిపారు. పాఠశాల సౌకర్యార్థం 30000 రూపాయల విలువగల పరికరాలను అందించిన వ్యాపారవేత్త విజయ్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అశోక్, వినోద్, దీపిక, రవీందర్, రవి ,మాలతి  పాల్గొన్నారు.
Spread the love