బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, అభ్యాస పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ లు మాట్లాడుతూ ఈ నూతన పాఠ్యపుస్తకాలు విద్యార్థుల వికాసానికి ఎంతో తోడ్పడుతాయన్నారు. వీటిని విషయ నిపుణులు, ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘ అనుభవం కలిగినవారు విద్యార్థుల స్థాయికి అనుగుణంగా, విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి కృత్యాల రూపంలో తయారు చేయడం జరిగిందని వివరించారు. ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమంలో భాగంగా ఈ పాఠ్యపుస్తకాలలోని విషయాలను ఏ విధంగా బోధించాలో కూడా హ్యాండ్ బుక్ లను ప్రతి ఉపాధ్యాయునికి అందించడం జరిగిందని, వీటిలో సూచించిన విధంగా ప్రతి పీరియడ్ ను బోధించాల్సి ఉంటుందని, వెంటనే ఆ పీరియడ్ లో నేర్చుకున్న విషయాన్ని అభ్యాసం చేయడానికి అభ్యాస పుస్తకంలో కృత్యాలు ఇవ్వడం జరిగిందని, 5+1 విధానంలో 5 రోజులు బోధన 6వ రోజు అసెస్మెంట్ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి స్థాయికనుగుణంగా భోధన చేస్తామన్నారు.