నవతెలంగాణ-బెజ్జంకి
నేటి నుండి ఈ నెల 23 వరకు మండలంలోని అయా గ్రామాల్లో గాలికుంటు వ్యాది నివారణ టీకాలు పంపిణీ చేయనున్నట్టు అదివారం మండల పశువైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గాలికుంటు, లంపీ స్కీన్ వ్యాది నివారణకు ముందస్తుగా పశువులకు టీకాలు పంపిణీ చేస్తామని నేడు మండల కేంద్రంతో పాటు ఎల్లంపల్లిలో టీకాలు పంపిణీ చేస్తామని పశువుల యాజమానులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.