అర్హులందరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అర్హులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండి రానున్న ఎన్నికలలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం మండలం లోని లక్నవరం చెరువు వద్ద  సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (ఎస్విఈఈపి) లో భాగంగా హై వోట్ ఫర్ షూర్ అనే నినాదం, విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యతను, ఓటర్ నమోదు, ఓటుహక్కు సద్వినియోగం పై ప్రజలలో ఓటు హక్కుపై నిర్వహించిన  ఓటరు అవగాహన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్ఫీ స్టాండ్ ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, నమోదైన ప్రతి ఓటరు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవాలని ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  ఐ ఓటు ఫర్ షూర్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు పై అవగాహన ఉండాలని ఫామ్ -6, ఫామ్- 7, ఫామ్ -8 వీటన్నిటిని తెలుసుకొని ఉండాలన్నారు.ఫామ్ -6 ద్వారా ఓటు నమోదు చేసే కార్యక్రమం ఉంటుందని, అదేవిధంగా ఫామ్ 7 ద్వారా చనిపోయిన, డూప్లికేట్, మై గ్రేటెడ్ ఓటర్స్ ను తీసివేయడానికి ఉపయోగిస్తారన్నారు. ఫామ్+ 8 ద్వారా ఎపిక్ కార్డులు మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు. పి డబ్ల్యు డి ఓటర్స్ విషయంలో ఫామ్- 8 క్రింద నమోదు చేసుకోవచ్చని వివరించారు. యువత వారి ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అందరితో ఓటు హక్కు పై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ కే. సత్య పాల్ రెడ్డి, సీఈఓ ప్రసూన రాణీ , డి డబ్ల్యుఓ ప్రేమలత, డిఎంఅండ్ హెచ్ ఓ అప్పయ్య, డి సి ఓ సర్దార్ సింగ్, డి సి ఎస్ఓ అరవింద్ రెడ్డి, సిపిఓ ప్రకాష్, డి ఏ ఓ గౌస్ హైదర్, డి పి ఆర్ ఓ రఫిక్, కలెక్టరేట్ ఏ ఓ ప్రసాద్,  తహసిల్దార్లు ఎన్. విజయ భాస్కర్, రాజ్ కుమార్, గోవిందరావుపేట్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ సూపర్ ఇండెంట్ రాజ్ ప్రకాష్, కలెక్టరేట్, ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాల సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయుల,  యువతీ, యువకులు, విద్యార్థిని,  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love