బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి: జిల్లా జడ్జి

Everyone must work together to protect children's rights: District Judgeనవతెలంగాణ – కంఠేశ్వర్ 

మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవ సాధికారత సంస్థ సమావేశ మందిరంలో బాలల హక్కుల వారో త్సవాలు ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పాటుపడాలని అన్నారు. పిల్లలు అన్ని హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని బాల్యం అంటే వారి శారీరక మానసిక అపరి పక్వత సమయంలో పిల్లలకు రక్షణ సంరక్షణ, చట్టపరమైన రక్షణ చాలా అవసరం బాలల హక్కుల్లో భాగంగా జీవించే హక్కు ,గుర్తింపు, అభివృద్ధి ,విద్య  వినోదం అన్ని రంగాలలో వారికి తోడ్పాటు అందించాలని కోరారు. పిల్లలను అక్రమ రవాణా, హింస, బాల కార్మికులుగా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. బాలలపై వేధింపులను అరికట్టడానికి రక్షణ కవచంగా పనిచేయాలని కోరారు.ఈ సందర్భంగా మహిళా కమిషన్ సభ్యులు సుదం లక్ష్మి మాట్లాడుతూ.. అమ్మాయిలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున అందించే ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, లైంగిక వేధింపులు గురి కాకుండా చూడాలని కోరారు. క్రీడలు చదువు సాంకేతిక రంగాలలో అమ్మాయిలు ముందంజలో ఉన్నారని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి షేక్ రసూల్ బి మాట్లాడుతూ..  జిల్లాల్లో ఆరు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయని ఇందులోనీ పిల్లలను వారం రోజులపాటు ఆట పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మత్తు పదార్థాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. మానవతా సదన్, బాలసదనం పిల్లల సాంస్కృత కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సాధికారిక సంస్థ కార్యదర్శి పద్మావతి,డీసీపీ బసవ రెడ్డి, డిసిపిఓ చైతన్యకుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాజేందర్, స్నేహ సొసైటీ సిద్దయ్య,సాధన ఎన్జీవో కోఆర్డినేటర్ మధు,డిసిపియు చైల్డ్ లైన్ సిబ్బంది, గుమ్మడి ఫౌండేషన్ సదానంద రెడ్డి ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love