జిల్లా స్థాయి కరాటే బెల్ట్స్‌ ప్రధానం

నవతెలంగాణ-మెదక్‌
మెదక్‌ పట్టణంలోని గుల్షన్‌ క్లబ్‌లో రెంజుకి షాటోకన్‌ స్పోర్ట్స్‌ కరాటే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కరాటే బెల్ట్‌ పరీక్ష నిర్వహిం చారు. ఈ పరీక్షకు చీఫ్‌ ఎగ్జామినర్‌గా రెంజుకి షాటోకన్‌ స్పోర్ట్స్‌ కరాటే ఆఫ్‌ ఇండియా వ్యస్థాపకులు, కరాటే సీనియర్‌ మాస్టర్‌ నగేష్‌ మాస్టర్‌, అబ్జర్వర్‌గా విద్యాసాగర్‌ వ్యవహరించా రు. కరాటే బెల్ట్‌ పరీక్షకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లో బెల్ట్‌ విభాగంలో శ్రీరామ్‌, విక్రమ్‌, తన్వి, సజ్జన, సరేనా శ్రీయాన్‌, సఫియా, ఫరీనా పూరకన్‌, శ్రీవర్ధన్‌, మనస్విని, ఆద్విక, ప్రణయప్ప, ఆరంజ్‌ బెల్ట్‌ విభాగంలో జయశ్రీ, సుహానిక, పద్విక, వర్ణిక, గ్రీన్‌ బెల్ట్‌ విభాగంలో సాత్విక్‌, విహాన్‌, నిశ్విత, కార్తీక్‌, బ్లూ బెల్ట్‌ విభాగంలో శ్రీజ, సాన్విక, షాలోమ్‌, పర్పుల్‌ బెల్ట్‌ విభాగంలో రుత్వి యశ్విత రాజ్‌ రుత్విక్‌, హనుష్క చారి, సహస్ర వర్మ, బ్రౌన్‌ బెల్ట్‌ 4 విభా గంలో హన్విత, నిజజ్ఞ, మౌనిక, సచిన్‌, బ్రౌన్‌ 3 బెల్టు విభాగంలో ప్రణవి, పల్లవి, బ్రౌన్‌ 2 బెల్ట్‌ విభాగంలో కనిష్కచారి, దేవకుమార్‌, బ్రౌన్‌ 1బెల్ట్‌ విభాగంలో హిందూ, శాంతి కుమార్‌ లు ఉత్తీర్ణత సాధించినట్లు కరాటే మాస్టర్‌ దినకర్‌ తెలిపారు. ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులను కరాటే మాస్ట ర్‌ నగేష్‌ మాస్టర్‌ బెల్ట్స్‌ ప్రాధాన్యం చేశారు. ఈ కార్యక్రమంలో సూరజ్‌, ఐశ్వర్య, అఖిల్‌, రిషి పాల్గొన్నారు.

Spread the love