నవతెలంగాణ -మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలో సోమవారం నాడు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ పటేల్ కుమారుడి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గజ్జు పటేల్, మద్నూర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు హనుమాన్లు, డోంగ్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు, వీరితో పాటు ఇరు మండలాల బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులకు అక్షంతలు వేసి ఆశీర్వాదించారు. కుమారుడి పెళ్లి హాజరైన నాయకులకు మల్లికార్జున్ పటేల్ కుటుంబ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. పెళ్లి హాజరైనందుకు ప్రతి ఒక్క నాయకులకు మల్లికార్జున్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు.