నవతెలంగాణ- తాడ్వాయి
ముదిరాజులకు కామారెడ్డి జిల్లాలో ఒక్కసారి ఏ పార్టీ తరపున పోటీ చేయడానికి” బి.పాం” ఇస్తే ఆ పార్టీకే తమ జాతి పూర్తి మద్దతు ఇస్తామని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ డిమాండ్ చేశారు ఆదివారము కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్దమ్మ ఆలయం లో జరిగిన ప్లీనరీ నిర్వహణ కోసం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తము 76 యేండ్ల స్వాతంత్ర దినోత్సవంలో తమ ఆకాంక్షలు, డిమాండ్ల లను ప్రభుత్వం అధికారికంగా ఇప్పటికీ తీర్చ లేదని, ఖరాఖండిగా చెప్పారు. GO no 15 ను వెంటనే అమలు చేసే పార్టీకే రాబోయే ఎన్నికల్లో ముదిరాజుల మద్దతు ఉంటుందని, లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే నే ఓట్లు వేయాలా i పిలుపు ఇచ్చారు. 1000 కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రతీ ముదిరాజు ను మత్స్య శాఖ ద్వారా సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ కుటుంబానికి 5లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం ముదిరాజ్ బందు పథకం ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనకాయ ముదిరాజ్ యువత ప్రధాన కార్యదర్శి జగన్ ముదిరాజ్, pp నంద రమేష్ ముదిరాజ్ న్యాయవాది భిక్షపతి ముదిరాజ్ ,పట్టణ అధ్యక్షులు లక్ష్మినారాయణ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కాళ్ళ గంగరాజు ముదిరాజ్,మహేష్ ముదిరాజ్ ,మురళి ముదిరాజ్ గోవర్ధన్ ముదిరాజ్ ,శంకర్ ముదిరాజ్ ,పిల్లి మల్లేష్ ముదిరాజ్ , వివిధ పాందిల అధ్యక్షులు కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు