రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు గుర్తింపు తేవాలి

– జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులు, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీఎం కప్‌ పోటీల్లో పాల్గొన్ని, మంచి ప్రతిభను కనబరచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్‌ భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ క్రీడా పోటీల్లో భాగంగా జిల్లాలో మూడు రోజుల పాటు మండల స్థాయి పోటీలు నిర్వహించి, గెలుపొందిన క్రీడాకారులతో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. జూన్‌ 2న జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా 21 రోజుల పాటు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయిలో 10 ఏండ్ల అభివృద్ధిపై ప్రతి ఒక్కరికీ తెలిసే విధంగా ముందుకు సాగుదామన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ మెమొం టోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌ రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజరు కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, ఎంపీపీ చంద్రకళ, దళిత ఉత్స వాల కమిటీ మాజి అధ్యక్షులు రాజలింగం, జిల్లా యువ జన, క్రీడల శాఖ అధికారి హనుమంత్‌ రావు, గిరిజన సంక్షే మ శాఖ అధికారి కోటాజి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్‌, వికారాబాద్‌ ఎంపీడీఓ సత్తయ్య, సీఎం కప్‌ క్రీడల చైర్మన్‌ మహమ్మద్‌ ఖాజా, కన్వీనర్‌ వినోద్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నర్సింలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love