జిల్లా వీధి నాటకోత్సవాలు..

District Street Drama Festivals– ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఈనెల 13,14 తేదీలలో ముస్తాబైన చౌటుప్పల్..
నవతెలంగాణ – భువనగిరి
కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అనే నినాదంతో ఏర్పడ్డ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వీధి నాటకోత్సవాలు షార్ట్ 24 ఈ నెల 13 , 14 తేదీల్లో చౌటుప్పల్ లో ఏర్పాటు చేయనున్నారు.  ప్రజలలో సామాజిక చైతన్యం తీసుకురావడం సమస్యలపై పోరాటం చేసే విధంగా తీర్చిదిద్దడం ప్రజానాట్యమండలి విధిగా పనిచేస్తుంది. మతోన్మాదం అధిక ధరలు, వివక్షతలు, సామాజిక, ఆర్థిక విధానాలు, విద్యా వైద్య ఆరోగ్యం పై సమాజంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రజానాట్యమండలి కృషి చేస్తుంది.  అందులో భాగంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జిల్లా వీధి నాటకోత్సవాలను చౌటుప్పల్ లో నిర్వహిస్తున్నారు.
జానపద కళావారసత్వం..
తెలంగాణ వారికి అపూర్వమైన జానపద కళావారసత్వం ఉన్నది. జానపద కళా సాహిత్యం ద్వారా జాతి సాంస్కృతి తెలుస్తుంది.  ఆ సంస్కృతిని కాపాడడంలో ప్రజానాట్యమండలి రాష్ట్రంలో అగ్రభాగాన ఉంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. జానపద ప్రదర్శన కలలకు తెలంగాణ భూమి పండిన పంట పొలం లాంటిది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. ఎన్నో రకాల జానపద ప్రదర్శన కళలు. తెలంగాణ నేలలు సంపన్నం చేశాయి. శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపద ప్రదర్శన కళలే
మొదటిరోజు వీధి నాటకోత్సవాలు..
13వ తేదీన ప్రధానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గంటపాక శివ అధ్యక్షతన వీధి నాటకోత్సవాలు నిర్వహించనున్నారు ఈ సభకు ఎమ్మెల్సీ ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్, నవ తెలంగాణ న్యూస్ ఎడిటర్ రాంపల్లి రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి  ఎండి జహంగీర్, జిల్లా ఉపాధ్యక్షులు ఆవార్ గోవర్ధన్ పాల్గొననున్నారు. బూతుల పురాణం, ధరల దెబ్బ, రైతుల బతుకు, వీర తెలంగాణ నాటకాలు ప్రదర్శిస్తారు.
14వ తేదీన  వీధి నాటకోత్సవాలు..
14వ తేదీన వీటి నాటకోత్సవాలను సభను ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాల అధ్యక్షతన నిర్వహిస్తారు ఈ సభకు సామాజిక కార్యకర్త పిఏ దేవి ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ ప్రముఖ రచయిత గాయకుడు ఆజనేయులు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ హాజరవుతారు.
ప్రదర్శించు కళారూపాలు..
గొర్రెలు తిరగబడతాయి, ఆడపిల్ల( ఒగ్గు కథ) మూఢనమ్మకాలు, రైతు నాటిక, హర హర శంభో సద్గురు దేవా నాటకాలను ప్రదర్శిస్తారు.
వీధి నాటకోత్సవాలను విజయవంతం చేయండి..
జిల్లాస్థాయి వీధి నాటకోత్సవాలలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కళారూపాలను ఆదరించాలని ప్రజానాట్యమండలి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కార్యదర్శి గంటేపాక శివ, ఈర్ల ముత్యాలు విజ్ఞప్తి చేశారు. ఈనెల 13,14 తేదీలలో సాయంత్రం 6 గంటలకు చౌటుప్పల్ మండల కేంద్రంలో ఈ వీధినాటకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటకాలలో ప్రజా సమస్యలతో పాటు, సామాజిక చైతన్యంతో పాటు, ఆధునిక సమాజ మార్పులు, హాస్యం,  పలు అంశాలతో కూడిన నాటకాలను ప్రదర్శిస్తామన్నారు. కళాకారులు మేధావులు ప్రజలు ఈ వీధి నాటకోత్సవాలలో పాలుపంచుకోవాలని కోరారు.
Spread the love